Allu Arjun: మంకీ క్యాప్‌, గడ్డంతో కొత్త లుక్‌లో అల్లు అర్జున్‌.. ఫొటోలు వైరల్‌

Allu Arjun with stylish look spotted in airport
  • సుకుమార్‌ దర్శకత్వంలో నటించనున్న బన్ని
  • కొత్త సినిమాలో కొత్త లుక్‌ కోసం ప్రయత్నాలు
  • ఎయిర్‌పోర్టులో కనపడ్డ స్టైలిష్ స్టార్‌
'అల.. వైకుంఠపురములో' సినిమా ఘనవిజయం సాధించిన జోష్‌లో ఉన్న అల్లు అర్జున్‌ కొన్ని రోజులుగా కొత్త లుక్‌లో కనపడుతున్నారు. ఆయన తదుపరి సినిమా సుకుమార్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకోనుంది. ఇందులో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం ఆయన కొత్త గెటప్‌ కోసం ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే టాక్ వచ్చింది.

ఈ సినిమాలో ఆయన లుక్‌తో పాటు మాట్లాడే భాష యాస కూడా కొత్తగా ఉంటుందట. తాజాగా, స్టైలిష్ స్టార్‌ విమానాశ్రయంలో కనపడ్డారు. మంకీ క్యాప్‌, గడ్డంతో ఆయన కనపడిన లుక్‌ అదుర్స్ అనిపిస్తోంది. ఆయన ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కొత్త సినిమాలో కొత్త లుక్‌ కోసం చేస్తోన్న ప్రయత్నాల్లో భాగంగానే ఆయన ఇలా దర్శనమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Allu Arjun
Tollywood

More Telugu News