srimukhi: 'ముద్దు పెడతానంటే వద్దని చెప్పావా?' అంటూ నెటిజన్‌ ప్రశ్న.. జవాబు చెప్పిన యాంకర్ శ్రీముఖి

srimukhi chat with netizens
  • అడిగితే వద్దని చెప్పాను
  • ఒకరితో ప్రేమలో ఉన్నా
  • తల్లిదండ్రులకు అబద్ధాలు చెబుతా 
  • స్నేహితులని కలవడానికి  అసత్యాలు చెప్పా 
హాట్ యాంకర్‌ శ్రీముఖి తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేసింది. వారు అడుగుతున్న చిలిపి ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఎవరైనా నీకు ముద్దు పెడతానంటే వద్దని చెప్పావా? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె నవ్వుతూ సమాధానం చెప్పింది. 'అడిగితే వద్దని చెప్పాను' అని తెలిపింది. పక్కింట్లో ఉంటున్న వారిపై నువ్వెప్పుడైనా నిఘా పెట్టావా? అని ఒకరు అడిగిన ప్రశ్నకు... నో చెప్పింది.

తాను ఒకరితో ప్రేమలో ఉన్నానని శ్రీముఖి తెలిపింది. ఒక్కోసారి తల్లిదండ్రులకు తాను అబద్ధాలు చెబుతానని చెప్పింది. స్నేహితులని కలవడానికి తాను కొన్ని సార్లు అసత్యాలు చెప్పానని పేర్కొంది తన వయసు విషయంలో ఇతరులకు తాను ఎన్నడూ అబద్ధాలు చెప్పబోనని తెలిపింది. కాలేజీల్లో చదువుతున్నప్పుడు చాలా సార్లు చీటింగ్ చేశానని తెలిపింది.
srimukhi
Tollywood

More Telugu News