Naina Jaiswal: టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్

Table Tennis player Naina Jaiswal Facebook Acoount Hacked
  • పాస్‌వర్డ్ మార్చేసి వీడియోలు అప్‌లోడ్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి
  • జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సొంతం చేసుకున్న నైనా
  • ఫేస్‌బుక్‌లో 2 లక్షల మంది ఫాలోవర్లు
తన ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయిందంటూ ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ నిన్న హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాచిగూడకు చెందిన జైస్వాల్ అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు పలు పతకాలు అందించింది. చదువులోనూ ముందుండే నైనా.. ఎనిమిదేళ్ల వయసులోనే పదో తరగతి పూర్తిచేసింది. 17 ఏళ్ల నుంచి పీహెచ్‌డీ మొదలుపెట్టింది. రెండు చేతులతోనూ ఒకేసారి రాయగల నేర్పు ఉన్న జైస్వాల్.. మోటివేషనల్ స్పీకర్ కూడా. పేస్‌బుక్‌లో రెండు లక్షల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. తాజాగా ఆమె ఖాతాను హ్యాక్ చేసిన దుండగుడు పాస్‌వర్డ్ మార్చేసి కొన్ని వీడియోలను అప్‌లోడ్ చేశాడు. తన ఖాతా హ్యాక్ అయిందన్న విషయం తెలుసుకున్న జైస్వాల్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Naina Jaiswal
Hyderabad
Facebook
Hacked

More Telugu News