Donald Trump: ట్రంప్ పర్యటన ఎఫెక్ట్.. భారత్ ఎక్కడుందంటూ వెతికిన అమెరికన్లు!

Americans search about India over the trump tour
  • భారత్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ట్రంప్
  • అమెరికా మీడియా విస్తృత కథనాలు
  • గూగుల్ ట్రెండ్స్‌లో మోతెక్కిన ‘వాటీజ్ ఇండియా’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సంగతేమో కానీ.. గూగుల్‌ ట్రెండ్స్‌లో భారతదేశానికి సంబంధించిన సెర్చ్‌లు అగ్రస్థానంలో నిలిచాయి. ట్రంప్ రెండు రోజుల ఇండియా పర్యటనను అమెరికా పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. దేశంలో ఆయనకు లభించిన అపూర్వ స్వాగతంపై పుంఖానుపుంఖాలుగా రాశాయి.

దీంతో అమెరికన్లలో భారత్‌పై ఆసక్తి పెరిగింది. వెంటనే ‘వేరీజ్ ఇండియా’, ‘వాటీజ్ ఇండియా’ అంటూ ప్రశ్నలతో గూగుల్‌లో విస్తృతంగా వెతికారు. దీంతో గూగుల్ ట్రెండ్స్‌లో ఈ రెండు ప్రశ్నలు అగ్రస్థానంలో నిలిచాయి. కాగా, భారత్‌లో రెండు రోజుల పర్యటన కోసం 24న ఇండియా వచ్చిన ట్రంప్.. నిన్న రాత్రి రాష్ట్రపతి విందు అనంతరం తిరిగి పయనమయ్యారు.
Donald Trump
India
America
Google trends

More Telugu News