Donald Trump: భారత్‌లో ముగిసిన ట్రంప్ రెండు రోజుల పర్యటన.. భారత్‌కు బైబై!

US President Donald Trump depart from Delhi
  • రాత్రి 10:32 గంటలకు సతీసమేతంగా పయనం
  • భారత్‌లో గడిపిన ఈ రెండు రోజులను మర్చిపోలేనన్న ట్రంప్
  • ఇరు దేశాల మధ్య అధునాతన ఆయుధాలపై రూ.21,500 కోట్ల ఒప్పందం
భారత్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు రోజుల పర్యటన ముగిసింది. ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్‌ కోవింద్ ఇచ్చిన విందుకు హాజరైన ట్రంప్ దంపతులు.. అనంతరం రాత్రి 10:32 గంటలకు అమెరికా పయనమయ్యారు. అంతకు ముందు విందులో ట్రంప్‌ మాట్లాడుతూ... 'భారత్‌, అమెరికా మధ్య సత్సంబంధాలు సుదీర్ఘకాలం కొనసాగాలని ఆకాంక్షించారు.

మొతేరా స్టేడియంలో తనకు లభించిన ఘన స్వాగతాన్ని స్మరించుకున్న ట్రంప్.. భారత్‌పైనా, ఇక్కడి ప్రజలపైనా అపారమైన గౌరవం ఉందన్నారు. భారత్‌లో గడిపిన ఈ రెండు రోజులను తాను ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య అధునాతన ఆయుధాలపై రూ.21,500 కోట్ల ఒప్పందం జరిగింది. చమురు, ఆరోగ్య రంగాల్లో మరో రెండు ఎంవోయూలు కుదిరాయి.
Donald Trump
India
America
Narendra Modi

More Telugu News