Chittoor District: మహిళా కండక్టర్‌ దుస్తులను చించేస్తూ దాడి చేసిన ప్రయాణికుడు

passenger attacks women conductor
  • చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన
  • కండక్టర్‌ చొక్కాను పట్టుకుని, వదలకుండా పిడిగుద్దులు
  • నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు  
చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా కండక్టర్‌ దుస్తులను ఓ ప్రయాణికుడు చించేశాడు. ఆమె చొక్కాను పట్టుకుని, వదలకుండా పిడిగుద్దులు కురిపిస్తూ దాడి చేశాడు. గుర్రంకొండ తరికొండల సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మదనపల్లి డిపోకు చెందిన ఓ బస్సు  ఎక్కిన ప్రయాణికుడిని టిక్కెట్‌ తీసుకోవాలని మహిళా కండక్టర్‌  అడిగింది. తాను తీసుకోనని ప్రయాణికుడు చెప్పాడు.

దీంతో తీసుకోవాల్సిందేనని ఆమె చెప్పడంతో శివారెడ్డి అనే వ్యక్తి దాడికి దిగాడు. దీంతో డ్రైవర్‌ బస్సును ఆపాడు. బస్సు కిందకు దిగి మహిళా కండక్టర్‌ను అందరూ చూస్తుండగానే అతడు కొట్టాడు. అతడిని తోటి ప్రయాణికులు అదుపుచేసి. పోలీసులకు సమాచారం అందించారు. అతడిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.
Chittoor District
Crime News

More Telugu News