dishapatani: హీరోయిన్‌ పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!

dishapatani video goes viral
  • గాల్లోకి ఎగిరి బాలీవుడ్ హీరోయిన్‌ దిశా పటానీ ఫైటింగ్‌ ప్రాక్టీస్‌ 
  • ట్రైనర్ సాయంతో ఆమె చేసిన ఫీట్‌ మామూలుగా లేదు 
  • 'బ్యాక్‌ ఫ్లిప్‌ ఫీట్‌' వేసి అదరగొట్టేసిన హీరోయిన్ 
గాల్లోకి ఎగిరి బాలీవుడ్ హీరోయిన్‌ దిశా పటానీ ఫైటింగ్‌ ప్రాక్టీస్‌ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేసింది. ట్రైనర్ సాయంతో ఆమె చేసిన ఈ ఫీట్‌ మామూలుగా లేదు. దిశా పటానీ ఫిటినెస్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుంది.

సినిమా షూటింగులతో తీరిక లేకుండా ఉంటున్నప్పటికీ వ్యాయామం చేయడం మాత్రం ఆపదు ఈ భామ. తాజాగా ఇలా 'బ్యాక్‌ ఫ్లిప్‌ ఫీట్‌' వేసి అదరగొట్టేసింది. ఆమె వీడియో చూస్తోన్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. జాకీచాన్‌, బ్రూస్లీలా అమ్మాయిలు కూడా అదరగొట్టేయగలరని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జిమ్‌లో ట్రైనర్‌ సాయంతో రెండుసార్లు బ్యాక్‌ ఫ్లిప్‌ ఫీట్‌ వేయడం విశేషం.
dishapatani
Viral Videos
Bollywood

More Telugu News