Sanjeevarao: వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే హఠాన్మరణం... దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్

Former MLA Sanjeevarao died
  • గుండెపోటుతో సంజీవరావు కన్నుమూత
  • నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి
  • సంజీవరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్

వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే సంజీవరావు ఈ రోజు కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయనను నిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సంజీవరావు ఆకస్మిక మృతి వార్త తెలియడంతో సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతికి గురయ్యారు. సంజీవరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థించినట్టు సీఎం కేసీఆర్ పేరిట తెలంగాణ సీఎంవో ట్వీట్ చేసింది.

సంజీవరావు 2014లో వికారాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపుపొందారు. ఆయన స్వస్థలం నవాబు పేట మండలంలోని గేటు వనంపల్లి. కిందటి ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించకపోవడంతో సంజీవరావు టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తనకు బదులు మెతుకు ఆనంద్ కు కేటాయించడంతో అలకబూనారు.

  • Loading...

More Telugu News