Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు తెలుగు వ్యక్తుల మృతి

Three Hyderabad people died in a road accident in USA
  • తెలుగు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారును ఢీకొన్న మరో కారు
  • అక్కడిక్కడే మృతి చెందిన తెలుగు వ్యక్తులు
  • మృతులు హైదరాబాద్, విజయవాడకు చెందిన వారిగా గుర్తింపు
అమెరికాలోని తెలుగు సమాజంలో విషాదం నెలకొంది. అమెరికాలోని ఎఫ్ఎం 423 ఇంటర్ సెక్షన్ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారును మరో కారు బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురూ సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మృతి చెందిన వారిని రాజా, ఆవుల దివ్య, ప్రేమ్ నాథ్ గా గుర్తించారు. వీరిలో హైదరాబాద్ కు చెందిన రాజా, దివ్య దంపతులు. ముషీరాబాద్ లోని గాంధీనగర్ కాలనీకి చెందినవారు. ప్రేమ్ నాథ్ స్వస్థలం విజయవాడ అని తెలుస్తోంది. కాగా, ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Road Accident
Hyderabad
USA
FM423 Intersection
Police

More Telugu News