Sathya Prakash: రవితేజకు .. ప్రకాశ్ రాజ్ కు నేనే దూరమయ్యాను: నటుడు సత్య ప్రకాశ్

Sathya Prakash Interview
  • రవితేజ నాకు మంచి స్నేహితుడు 
  • ప్రకాశ్ రాజ్ నన్ను దాటేసుకుని ఎదిగిపోయాడు
  • తను మారలేదంటున్న సత్య ప్రకాశ్  
ప్రతినాయక పాత్రల ద్వారా సత్యప్రకాశ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. " నేను .. రవితేజ మంచి స్నేహితులం. అప్పట్లో ఇద్దరం కలిసి ఒకే బైక్ పై తిరిగే వాళ్లం. రవితేజ కంటే ముందు నటుడిగా  సినిమాల్లో నేను ఒక స్థాయికి వెళ్లాను. ఆ తరువాత రవితేజ చిన్నచిన్న వేషాలు వేస్తూ హీరో అయ్యాడు. నేను అప్పటి పొజీషన్లోనే వున్నాను. రవితేజ మాత్రం నన్ను దాటేసుకుని దూసుకుపోయాడు.

అలాగే ప్రకాశ్ రాజ్ .. నేను కూడా మంచి స్నేహితులం. ఆయన కూడా నా తరువాతనే అవకాశాలను అందిపుచ్చుకుంటూ నన్ను దాటేసుకుని ఎదిగిపోయాడు. అయితే గతంలో మా మధ్య వున్న అనుబంధం ఇప్పుడు లేదు. వాళ్లకి స్టార్ డమ్ వచ్చేసింది .. వాళ్ల ఫ్రెండ్ సర్కిల్ మారిపోతుంది. గతంలో మాదిరిగా నాతో వాళ్లు ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు. ఇక నాతో కెరియర్ ను మొదలెట్టి, నా స్థాయికి కూడా ఎదగనివాళ్లు వున్నారు. వాళ్లతో మాత్రం నేను స్నేహాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పటికీ నాతో వాళ్లు మునుపటి చనువుతోనే వున్నారు" అని చెప్పుకొచ్చాడు.
Sathya Prakash
Raviteja
Prakash Raj

More Telugu News