Tammineni Sitaram: వైసీపీకి వరుణదేవుడికి సంబంధం ఉందంటే, చంద్రబాబుకు మండుటెండలకు సంబంధం ఉన్నట్టే: తమ్మినేని

Assembly speaker Tammineni comments on Chandrababu
  • తప్పు చేయనప్పుడు దేవుడ్నైనా ఎదిరిస్తామని ధీమా
  • తమది తప్పులను సహించే ప్రభుత్వం కాదన్న తమ్మినేని
  • టీడీపీ నేతల తీరు దొంగే దొంగ అన్నట్టుగా ఉందని విమర్శలు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరుణదేవుడికి వైసీపీకి సంబంధం ఉందంటే, చంద్రబాబుకు మండుటెండలకు, కరవుకు సంబంధం ఉన్నట్టేనని అన్నారు. తప్పు చేయనప్పుడు దేవుడ్ని అయినా ఎదిరిస్తామని ధీమాగా చెప్పారు. మాది తప్పు చేస్తే ఊరుకునే ప్రభుత్వం కాదు అంటూ వ్యాఖ్యానించారు.  ఇసుక విషయంలో టీడీపీ నేతల తీరు దొంగే దొంగ అన్నట్టుగా ఉందని విమర్శించారు. తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే ప్రజా జీవితం నుంచి వైదొలగడానికైనా సిద్ధమని సవాల్ విసిరారు.
Tammineni Sitaram
YSRCP
Chandrababu
Telugudesam
Srikakulam District

More Telugu News