Melania Trump: ఢిల్లీ స్కూల్లో చిన్నారులకు హ్యాపీనెస్ పాఠాలు చెప్పిన మెలానియా ట్రంప్... వీడియో ఇదిగో!

Melania Trump takes Happiness class to Delhi kids
  • ట్రంప్ తో పాటు పర్యటిస్తున్న కుటుంబీకులు
  • మోతీబాగ్ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన మెలానియా
  • ఘనస్వాగతం పలికిన చిన్నారులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఆయన కుటుంబ సభ్యులు కూడా భారత్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న మధ్యాహ్నం భారత్ వచ్చిన ట్రంప్ కుటుంబీకులు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. తాజాగా, ట్రంప్ భార్య మెలానియా ఢిల్లీలోని ఓ పాఠశాలకు విచ్చేశారు. మోతీబాగ్ లోని ఆ ప్రభుత్వ పాఠశాలలో చిన్నారుల కోసం నిర్వహించే హ్యాపీనెస్ క్లాస్ కు హాజరయ్యారు. అమెరికా ప్రథమ మహిళకు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. చిన్నారులు విచిత్ర వేషధారణలో రావడం గమనించిన మెలానియా వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. అంతేకాదు, హ్యాపీనెస్ క్లాస్ లోనూ ఆనందోత్సాహాలు ప్రదర్శించారు.

  • Loading...

More Telugu News