Donald Trump: మన రెండు రాజ్యాంగాలు మూడు అందమైన పదాలతో ప్రారంభం అవుతాయి: ట్రంప్

Donald Trump makes interesting tweets
  • ఘనమైన రీతిలో స్వాగత సత్కారాలు
  • భారత్ పర్యటనను ఆస్వాదిస్తున్న ట్రంప్
  • రాజ్యాంగాలే కాదు విధానాలు కూడా ఒక్కటేనని ట్వీట్
భారత్ లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతోష సాగరంలో ఓలలాడుతున్నారు. ఇక్కడి ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతుండడం పట్ల ట్రంప్ ఆనందం అంతాఇంతా కాదు. మోదీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అపూర్వ స్వాగత కార్యక్రమాలు, నమస్తే ట్రంప్ ఈవెంట్ తో ట్రంప్ తన ప్రతిష్ఠ మరింత ఇనుమడించినట్టుగా భావిస్తున్నారు. ఈ సంబరాల వేళ ఆయన ట్విట్టర్ లో స్పందించారు.

"మన రెండు రాజ్యాంగాలు 'వియ్ ద పీపుల్' అనే మూడు అందమైన పదాలతో ప్రారంభమవుతాయి. దానర్థం, అమెరికాలో కానీ, భారత్ లో కానీ గౌరవం, మర్యాద, విశ్వాసం, సాధికారత, ప్రజల కోసం పోరాడే విధానం ఒకే విధంగా ఉంటాయి" అంటూ వ్యాఖ్యానించారు. అంతకుముందు మరో ట్వీట్ ను హిందీలో చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని, అమెరికా, భారత్ తమ అనుబంధాన్ని మరింత దృఢతరం చేసుకుంటాయని, ప్రజల ఆకాంక్షలను మరింత ఉజ్వలంగా నెరవేర్చుతాయని పేర్కొన్నారు.
Donald Trump
USA
India
Constitutions

More Telugu News