Guntur District: మహిళపై కాల్పులు జరిపి.. యువకుడి ఆత్మహత్య

youngster shoots women
  • గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలో ఘటన
  • ఓ అమ్మాయిని ప్రేమించిన యువకుడు
  • పెళ్లి చేసుకోవాలని చెప్పినందుకు కాల్పులు
  • ప్రియురాలి తల్లికి గాయాలు
గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామానికి చెందిన బాలాజీ అనే యువకుడు  కొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే, తనను పెళ్లి చేసుకోవాలని ఇటీవల ఆ అమ్మాయి అడగగా బాలాజీ అందుకు నిరాకరించాడు.  

ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు బాపట్ల పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై పగ పెంచుకున్న బాలాజీ తాను ప్రేమించిన అమ్మాయి తల్లిపై కాల్పులు జరిపాడు. ఈ రోజు ఆ యువకుడు తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు బాలాజీ మృతదేహాన్ని అతడి  బంధువులు గుర్తించారు. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోమని చెప్పినందుకే ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల్లో గాయపడ్డ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.


Guntur District
Crime News

More Telugu News