RRR: గూగుల్ చెబుతోంది... 'ఆర్ఆర్ఆర్' దర్శకుడు సంజయ్ పాటిల్ అట!

Google Says RRR Having two Directors
  • రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం
  • హీరోలుగా ఎన్టీఆర్, రామ్ చరణ్
  • గూగుల్ చూసిన నెటిజన్ల సెటైర్లు
'ఆర్ఆర్ఆర్'... ఈ పేరుచెప్పగానే ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా, పాన్ ఇండియా చిత్రంగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రమే గుర్తొస్తుంది. దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం వచ్చే సంవత్సరం విడుదల కానుంది. ఇక ఈ సినిమా గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తే, ఇద్దరు దర్శకులని చూపిస్తూ ఉండటంతో, ఫ్యాన్స్ విస్మయం చెందుతున్నారు.

సినిమాకు దర్శకులుగా రాజమౌళితో పాటు సంజయ్ పాటిల్ అనే మరో వ్యక్తి పేరును కూడా గూగుల్ చూపిస్తోంది. ఇదే సమయంలో సంజయ్ పాటిల్ గురించి సెర్చ్ చేస్తే, ఎటువంటి సమాచారమూ రావడం లేదు. దీంతో ఆ సంజయ్ ఎవరన్నది గూగుల్ కే తెలియాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
RRR
Rajamouli
Google
NTR
Ramcharan

More Telugu News