India: ఎట్టకేలకు ఆలౌట్... తొలి టెస్టులో న్యూజిలాండ్ కు భారీ ఆధిక్యం!

First Innings Lead for New Zeland
  • వెల్లింగ్టన్ లో తొలి టెస్టు
  • 348 పరుగులు చేసిన న్యూజిలాండ్
  • ఐదు వికెట్లు తీసిన ఇశాంత్ శర్మ
వెల్లింగ్టన్ లో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 165 పరుగుల స్వల్ప స్కోరుకు ఆలౌట్ కాగా, న్యూజిలాండ్ 348 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టుకు 183 పరుగుల ఆధిక్యం లభించినట్లయింది.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో విలియమ్సన్ 89, టేలర్ 44, గ్రాండ్ హోమ్ 43, జెమీసన్ 44, బౌల్ట్ 38 పరుగులతో రాణించారు. ఇషాంత్ శర్మకు 5 వికెట్లు దక్కగా, రవిచంద్రన్ ఆశ్విన్ కు 3 వికెట్లు లభించాయి. బుమ్రా, షమీలకు చెరో వికెట్ లభించింది. మరికాసేపట్లో భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభం కానుండగా, ఓటమిని తప్పించుకోవాలంటే, భారీ ఇన్నింగ్స్ ఆడక తప్పని సరి పరిస్థితి నెలకొంది.
India
New Zeland
Cricket
Test

More Telugu News