Kumaram Bheem Asifabad District: కానిస్టేబుల్‌ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్

gun misfire in kumaram bheem district
  • కొమురంభీమ్ తిర్యాణి పోలీస్‌ స్టేషన్‌లో ఘటన
  • గన్‌ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు
  • పరిస్థితి విషమంగా ఉందంటోన్న వైద్యులు
కొమురంభీమ్ తిర్యాణి పోలీస్‌ స్టేషన్‌లో గన్‌ మిస్ ఫైర్ కావడంతో ఓ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆయన తలలోకి బుల్లెట్‌ దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ఆయన గన్ క్లీన్ చేస్తోన్న సమయంలో మిస్ ఫైర్ అయిందని దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అంటున్నారు. కానిస్టేబుల్ పేరు కిరణ్‌ అని, అతడు తీవ్ర గాయాలపాలై రక్తపు మడుగులో పడి ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తరలించామని వివరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Kumaram Bheem Asifabad District

More Telugu News