Pithani: విజిలెన్స్ రిపోర్టులో నా పేరు కానీ, అచ్చెన్నాయుడు పేరు కానీ ఎక్కడాలేదు: ఏపీ మాజీ మంత్రి పితాని

Pitani Satyanarayan fires on minister Jayaram over vigilance report
  • విజిలెన్స్ రిపోర్ట్ సీఎం కార్యాలయం నుంచి వస్తుంది
  • ఈమాత్రం అవగాహన లేకుండా మంత్రి జయరాం మాట్లాడుతున్నారు
  • మాపై జగన్ ప్రభుత్వం బురద చల్లడం మానుకోవాలి
తమపై జగన్ ప్రభుత్వం బురద చల్లడం ఆపేయాలని ఏపీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. ఈఎస్ఐ కుంభకోణంకు సంబంధించిన విజిలెన్స్ రిపోర్టులో తన పేరు కానీ, అచ్చెన్నాయుడు పేరు కానీ ఎక్కడా లేదని చెప్పారు. విజిలెన్స్ రిపోర్ట్ సీఎం కార్యాలయం నుంచి వస్తుందని... ఈమాత్రం అవగాహన కూడా లేకుండా మంత్రి జయరాం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2017లో కార్మిక మంత్రిగా తాను బాధ్యతలను స్వీకరించానని చెప్పారు. రిపోర్టులో పేర్కొన్న డైరెక్టర్లు రమేశ్, రవికుమార్ లపై విచారణకు తాను మంత్రిగా ఉన్నప్పుడే ఆదేశించానని తెలిపారు. మంత్రిగా ఉన్నప్పుడు తనపై ఎలాంటి ఆరోపణలు లేవని చెప్పారు.
Pithani
Atchannaidu
Telugudesam
Jayaram
Jagan
ysrcp

More Telugu News