Vijayasai Reddy: వాళ్లను మళ్లీ బానిసలను చేసే దాకా చంద్రబాబు నిద్రపోయేట్టు లేడు: ఎంపీ విజయసాయిరెడ్డి

Ysrcp mp Vijayasaireddy criticises  chandrababu naidu
  • మద్యం వ్యసనం నుంచి బయటపడుతున్నవారిని రెచ్చగొట్టడం తగదు
  • పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన వ్యక్తికి ఇంత కూడా బాధ్యత లేదా?
  • ఇలా మాట్లాడటం దేశంలో ఎక్కడా చూడలేదు
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మద్యం వ్యసనం నుంచి బయటపడుతున్న వారిని రెచ్చగొట్టి మళ్లీ బానిసలను చేసే దాకా చంద్రబాబు నిద్రపోయేట్టు లేరని, పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన వ్యక్తి ఇంత బాధ్యత లేకుండా మాట్లాడటం దేశంలో ఎక్కడా కనిపించదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడిపుడే తాగుడుకు దూరమవుతున్న వారు తమ భార్యాపిల్లలతో ప్రశాంతంగా గడుపుతున్నారంటూ విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు.
Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News