Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Kajal opposite Manchu Vishnu in Mosagallu flick
  • 'మోసగాళ్లు'లో కాజల్ అగర్వాల్
  • వెంకటేశ్ 'నారప్ప'కి హైలైట్ 
  • 60 కోట్లతో 'భక్తకన్నప్ప' నిర్మాణం    
 *  మంచు విష్ణు, కాజల్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'మోసగాళ్లు'. ఈ చిత్రం కోసం ఇటీవల లాస్ ఏంజిలిస్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. జెఫ్రీ జీ చిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తదుపరి షూటింగ్ సోమవారం నుంచి హైదరాబాదులో జరుగుతుంది.  
*  ప్రముఖ నటుడు వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న 'నారప్ప' చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. ఈ చిత్రం కోసం ఇటీవల ఇంటర్వెల్ ఫైట్ ను పీటర్ హెయిన్స్ నేతృత్వంలో పది రోజుల పాటు చిత్రీకరించారు. ఇది సినిమాకి హైలైట్ అంశాలలో ఒకటవుతుందని అంటున్నారు.
*  మంచు విష్ణు హీరోగా 'భక్తకన్నప్ప' పౌరాణిక చిత్రాన్ని భారీ తారాగణంతో నిర్మించనున్నట్టు ప్రముఖ నిర్మాత, నటుడు మోహన్ బాబు ప్రకటించారు. ఇది 60 కోట్ల భారీ బడ్జెట్టుతో నిర్మించడం జరుగుతుందని ఆయన తెలిపారు.           
Kajal Agarwal
Manchu Vishnu
Venkatesh
Mohan Babu

More Telugu News