Fitness Machine: కాసేపు ఒళ్లు వంచితే.. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఉచితంగా ఫ్లాట్ ఫామ్ టికెట్ ఇస్తారు!

Free platform ticket for few minutes workouts at Delhi railway station
  • ఢిల్లీ ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ లో ఫిట్ నెస్ యంత్రం ఏర్పాటు
  • దాని ముందు కొద్దిసేపు వ్యాయామం చేస్తే ప్లాట్ ఫామ్ టికెట్ ఫ్రీ
  • వీడియో పోస్టు చేసిన రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్
ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ కు వెళ్లినవారికి అక్కడో ఫిట్ నెస్ యంత్రం కనిపిస్తుంది. రైల్వే స్టేషన్ లో ఫిట్ నెస్ మెషీన్ ఏర్పాటు చేయడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ యంత్రం ఏర్పాటు వెనుక బలమైన కారణమే ఉంది. ప్రజల్లో వ్యాయామం, ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడమే రైల్వే శాఖ ముఖ్యోద్దేశం.

ఇక అసలు విషయానికొస్తే, ఎవరైనా ఆ ఫిట్ నెస్ మెషీన్ వద్దకు వచ్చి కొన్ని నిమిషాల పాటు వ్యాయామం చేస్తే అందులోంచి ఓ ప్లాట్ ఫామ్ టికెట్ ఉచితంగా మీ చేతికి వస్తుంది. రష్యాలో ఎప్పటినుంచో ఈ విధానం అమల్లో ఉంది. అక్కడ 30 సిటప్స్ చేస్తే టికెట్ ఫ్రీ. కాగా, దీనిపై రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ట్వీట్ చేశారు. ఫిట్ నెస్ తో పాటు పొదుపు కూడా సాధ్యం అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియో పోస్టు చేశారు.
Fitness Machine
New Delhi
Anand Vihar
Railway Station
Platform Ticket

More Telugu News