Rajasthan: రాజస్థాన్‌లో అమానవీయం.. రూ. 500 చోరీ చేశారని సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన షోరూం నిర్వాహకులు!

  • రూ.500 చోరీ చేస్తూ దొరికిన దళిత సోదరులు
  • చిత్రహింసలకు గురిచేసిన షోరూం సిబ్బంది
  • నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన రాహుల్ గాంధీ
Dalit Men Thrashed in Rajasthan for theft 500

రాజస్థాన్‌లో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రూ.500 చోరీ చేశారన్న కారణంతో ఇద్దరు దళిత సోదరులను చిత్రవధకు గురిచేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నాగౌర్ జిల్లాలోని ఓ బైక్ షోరూంలో రూ.500 చోరీ చేస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. షోరూం సిబ్బంది వారిని చితకబాదారు. అక్కడితో ఆగకుండా అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు. స్క్రూ డ్రైవర్‌కు పెట్రోలు పూసి ఓ బాధితుడి జననాంగంలోకి చొప్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చి వైరల్ అయింది. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News