H1B Visa: ట్రంప్–మోదీ భేటీలో హెచ్1బీ వీసాలపై చర్చించే చాన్స్: విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్
- ఐదు ఒప్పందాలపై చర్చలు, నిర్ణయాలు ఉంటాయి
- హెచ్1 బీ పైనా చర్చకోసం ప్రతిపాదించాం
- అమెరికా నుంచి అధికారిక సమాచారమైతే రాలేదని వెల్లడి
అమెరికాలో ఉద్యోగాల కోసం అత్యంత కీలకమైన హెచ్1 బీ వీసాల అంశం ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ చెప్పారు. ఇరు దేశాల మధ్య వివిధ అంశాలకు సంబంధించిన ఐదు ఒప్పందాలపై ట్రంప్, మోదీ చర్చించి, సంతకాలు చేయనున్నారని తెలిపారు.