Vijay Sai Reddy: ఈ తండ్రీకొడుకుల ఆస్తుల వెల్లడి ఎప్పుడూ ఉండే డ్రామానే: విజయసాయిరెడ్డి

Vijaysai Reddy reacts over Nara family assets
  • ఆస్తులు వెల్లడించిన నారా లోకేశ్
  • ఇది కొత్తేమీ కాదన్న విజయసాయిరెడ్డి
  • బహిర్గతం చేయని ఆస్తులు ఇంకెన్నో ఉన్నాయంటూ ట్వీట్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమ కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలు వెల్లడించడంపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి స్పందించారు. ఇది ఎప్పుడూ ఉండే రొటీన్ డ్రామానే అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఈ తండ్రీకొడుకులే ఏపీతో పాటు దేశ పరిస్థితికి అతిపెద్ద జవాబుదారీలని పేర్కొన్నారు. వారు ఇవాళ ఆస్తులు ప్రకటించడం కొత్తేమీ కాదని, కానీ వాళ్లకు సంబంధించిన వెల్లడికాని ఆస్తులు ఎన్నో ఉన్నాయని తెలిపారు. బహిర్గతం చేయని ఆస్తులు, బినామీ ఆస్తులు, రహస్య బ్యాంకు ఖాతాలు చాలా ఉన్నా వాటిపై ఎప్పుడూ విచారణ జరగలేదని విజయసాయి ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News