త్రివిక్రమ్ తో ఎన్టీఆర్.. పరిశీలనలో పూజా హెగ్డే .. రష్మిక పేర్లు
- త్రివిక్రమ్ తో రెండు సినిమాలు చేసిన పూజా హెగ్డే
- వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక
- త్వరలోనే పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
త్రివిక్రమ్ ఇంతకుముందు చేసిన 'అరవింద సమేత 'లోను .. 'అల వైకుంఠపురము'లోను కథానాయికగా పూజా హెగ్డేనే చేసింది. ఈ రెండు సినిమాలు విజయవంతం కావడం వలన, ఆ సెంటిమెంటుతో మళ్లీ ఆమెను తీసుకోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇక మరో వైపున రష్మిక కూడా వరుస హిట్లతో తన జోరు చూపిస్తోంది. అందువలన జోడీ కొత్తగా అనిపిస్తుందనే ఉద్దేశంతో ఆమెను ఎంపిక చేసే అవకాశాలు కూడా ఎక్కువేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.