Divyavani: పాలన అంటే మేకప్ వేసుకోవడం, జబర్దస్త్ స్కిట్ కాదని రోజా తెలుసుకోవాలి: దివ్యవాణి

TDP leader Divyavani fires on Roja
  • రోజా సినీ పరిశ్రమ తలదించుకునేలా వ్యవహరిస్తోందన్న దివ్యవాణి
  • సొంత నియోజకవర్గ ప్రజలే అసహ్యించుకుంటున్నారంటూ వ్యాఖ్యలు
  • చంద్రబాబును విమర్శించే స్థాయి రోజాకు లేదని మండిపాటు
చంద్రబాబు, లోకేశ్ చేసిన తప్పులకు జీవితాంతం జైల్లో ఉంటారంటూ వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నేత దివ్యవాణి ధ్వజమెత్తారు. చంద్రబాబును విమర్శించే స్థాయి రోజాకు లేదని అన్నారు. రోజా భజన కార్యక్రమాలు నిలిపివేసి ప్రజాసమస్యలను సీఎం ముందుంచాలని హితవు పలికారు. అయినా పాలన అంటే మేకప్ వేసుకోవడం, జబర్దస్త్ స్కిట్లు చేయడం కాదని రోజాకు చురకలంటించారు. సినీ పరిశ్రమ తలదించుకునేలా రోజా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సొంత నియోజకవర్గ ప్రజలే రోజాను అసహ్యించుకుంటున్నారని దివ్యవాణి విమర్శించారు.
Divyavani
Roja
Chandrababu
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News