TTD: తిరుమల శ్రీవారి భక్తులకు నేటి నుంచి వడ ప్రసాదం

TTD Ready to distribute Vada prasadam to Devotees
  • రోజుకు పదివేల వడ ప్రసాదాన్ని అందించనున్న టీటీడీ
  • ఇప్పటికే భక్తులకు అందుబాటులో కల్యాణోత్సవ లడ్డూలు
  • అవసరమైనన్ని వడలు సిద్ధం చేస్తున్న టీటీడీ
తిరుమల శ్రీవారి భక్తులకు మరో శుభవార్త. నేటి నుంచి సామాన్య భక్తులకు వడ ప్రసాదాన్ని అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు అవసరమైనన్ని వడలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 12న సాధారణ భక్తులకు కల్యాణం లడ్డూలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎటువంటి సిఫారసు లేఖలు లేకుండా కల్యాణం లడ్డూలను ప్రత్యేక కౌంటర్ ద్వారా సామాన్య భక్తులకు అందిస్తోంది. దీని ధర రూ.200. ఇప్పుడు దీంతోపాటు వడ ప్రసాదాన్ని కూడా అందించనుంది. రోజుకు 10వేల కల్యాణం లడ్డూలు, 10వేల వడ ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
TTD
Tirumala
Tirupati
Vadaprasadam

More Telugu News