Jagame Tantram: జగమే తంత్రం... ధనుష్ కొత్త సినిమా మోషన్ పోస్టర్ ఇదిగో!

Dhanush new movie Jagame Tantram motion poster released
  • విలక్షణ గెటప్పులో ధనుష్
  • చొక్కా, పంచె... చేతిలో తుపాకులు
  • కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
  • మే 1న రిలీజ్
యువ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం 'జగమే తంత్రం'. తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ధనుష్ డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తున్నారు. చొక్కా, పంచెతో తమిళ ట్రెడిషన్ ను ఫాలో అవుతున్నట్టు కనిపించినా, వీపుకు అస్సాల్ట్ రైఫిల్, చేతిలో పిస్టళ్లతో మాస్ లుక్ తో అదరగొడుతున్నాడు. వైనాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ నిర్మిస్తున్న 'జగమే తంత్రం' సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. ఇందులో ధనుష్ సరసన ఐశ్వర్యా లక్ష్మీ కథానాయికగా నటిస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా మే 1న రిలీజ్ కానుంది.

Jagame Tantram
D40
Motion Poster
Kartik Subbaraj

More Telugu News