Chandrababu: ఎన్టీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యలు

Chandrababu responds on NTR Trust day
  • 23 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఎన్టీఆర్ ట్రస్ట్
  • ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు
  • ట్రస్ట్ సిబ్బందికి అభినందనలు
  • కార్యకలాపాలు మరింత విస్తృతం చేయాలని సూచన
ఎన్టీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ను 23 ఏళ్ల క్రితం స్థాపించారని వెల్లడించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే భావనతో స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి పవిత్ర ఆశయాల స్ఫూర్తితో ట్రస్ట్ ఏర్పాటైందని వివరించారు.

అప్పటినుంచి ఇప్పటివరకు అనేక రంగాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్రస్ట్ సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మహానుభావుడు ఎన్టీఆర్ స్ఫూర్తితో, ఇనుమడించిన ఉత్సాహంతో ట్రస్ట్ తన కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ట్రస్ట్ నిర్వహణలో సహకరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.
Chandrababu
NTR Trust
NTR
Telugudesam
Andhra Pradesh
Telangana

More Telugu News