Chandrababu: చంద్రబాబు ఎదుట 200 కొబ్బరికాయలు కొట్టిన నందమూరి బాలకృష్ణ అభిమానులు.. వీడియో ఇదిగో

balakrishna fans say all the best to chandrababu
  • ప్రజా చైతన్య యాత్రకు బయలుదేరిన చంద్రబాబు
  • ఆల్‌ ది బెస్ట్ చెప్పిన బాలయ్య ఫ్యాన్స్
  • విజయవాడలో చంద్రబాబును కలిసిన అభిమానులు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఎదుట నందమూరి బాలకృష్ణ అభిమానులు ఈ రోజు 200 కొబ్బరికాయలు కొట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాచైతన్య యాత్ర చేపట్టాలని టీడీపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. 45 రోజుల పాటు జరగనున్న ఈ యాత్రకు చంద్రబాబు బయలుదేరారు. 13 జిల్లాల్లో 100కు పైగా నియోజకవర్గాల్లో ఈ యాత్ర నిర్వహిస్తారు.
 
ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రకు బయలుదేరిన నేపథ్యంలో ఆయన నివాసం వద్ద బాలకృష్ణ అభిమానులు ఆయనకు ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. 'ప్రజల మంచి కోసం, శ్రేయస్సు కోసం "నేనున్నాను" అని చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన ప్రజాచైతన్య యాత్ర విజయవంతం కావాలని 200 కొబ్బరికాయలు కొట్టిన విజయవాడ నందమూరి బాలకృష్ణ అభిమానులు' అంటూ తెలుగు దేశం పార్టీ ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.
Chandrababu
Balakrishna
Telugudesam
Vijayawada

More Telugu News