Donald Trump: భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం: భారత పర్యటన నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు

big trade deal with India for later Donald Trump
  • అధ్యక్ష ఎన్నికల లోపు ఒప్పందం కుదురుతుందో లేదో
  • వాణిజ్య అంశాల్లో భారత్‌  సరిగ్గా వ్యవహరించట్లేదు
  • భారత ప్రధాని మోదీ అంటే నాకెంతో ఇష్టమన్న ట్రంప్
ఈ నెల 24న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్‌కు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మున్ముందు భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం ఉంటుందని చెప్పారు. అయితే, అధ్యక్ష ఎన్నికల లోపు ఒప్పందం కుదురుతుందో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు.

ఇరు దేశాలకు మరిన్ని లాభాలు చేకూర్చేలా ఒప్పందం ఉండడం కోసం ప్రస్తుతానికి దీన్ని పక్కనబెట్టే అవకాశాలున్నాయని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. వాణిజ్య అంశాల్లో భారత్‌ తమతో సరిగ్గా వ్యవహరించట్లేదని ఆయన చెప్పారు. భారత ప్రధాని మోదీ అంటే తనకెంతో ఇష్టమని వ్యాఖ్యానించారు.


Donald Trump
america
India
Narendra Modi

More Telugu News