Vijay Sai Reddy: చంద్రబాబు ఆధ్వర్యంలో మొదలైన కొత్త నాటకం ఇది: విజయసాయి రెడ్డి

Vijaya Sai Critisiges Chandrababu
  • బయటపడుతున్న బాబు అక్రమాలు
  • ప్రజల దృష్టిని మరల్చేందుకే యాత్రలు
  • మాజీ పీఎస్ కాల్ లిస్ట్ బయటకు తీయాలన్న విజయసాయి
తాను సంపాదించిన అక్రమార్జన వ్యవహారాలు బయట పడుతూ ఉండటంతో, ప్రజల దృష్టిని మరల్చేందుకు కొత్త నాటకాన్ని మొదలు పెట్టారని, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "పదవి పోయిన తర్వాత కూడా చంద్రబాబు తన మాజీ పిఎస్ తో రోజుకి పదిసార్లు మాట్లాడేవాడట. ఆ కాల్ లిస్టు బయటకు తీస్తే దోపిడీ సొమ్ము సర్దుబాట్లపై మరింత సమాచారం బయటికొస్తుంది. 2 వేల కోట్ల అక్రమార్జన నుంచి దృష్టి మరల్చేందుకు ప్రజా చైతన్య యాత్ర అంటూ కొత్త నాటకం మొదలెట్టాడు" అని అన్నారు. 
Vijay Sai Reddy
Chandrababu
Twitter

More Telugu News