Jayasudha: తన కుమారుడి వివాహానికి రావాలంటూ సీఎం జగన్ ను ఆహ్వానించిన జయసుధ

Jayasudha invites CM Jagan for her sons wedding
  • త్వరలోనే జయసుధ తనయుడు నిహార్ వివాహం
  • ఢిల్లీకి చెందిన అమ్రిత్ కౌర్ తో నిహార్ పెళ్లి నిశ్చయం
  • ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్న జయసుధ

ప్రముఖ సినీ నటి, వైసీపీ మహిళా నేత జయసుధ సీఎం జగన్ ను కలిశారు. జయసుధ తనయుడు నిహార్ కపూర్ వివాహం త్వరలోనే జరగనుంది. ఢిల్లీకి చెందిన అమ్రిత్ కౌర్ తో నిహార్ పెళ్లి (ఫిబ్రవరి 26!) జరగనుంది. ఈ నేపథ్యంలో, జయసుధ కొన్నిరోజులుగా ప్రముఖులందరినీ కలుస్తూ తనయుడి వివాహానికి ఆహ్వానిస్తున్నారు. తాజాగా, తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి తనయుడితో కలిసి విచ్చేసిన ఆమె జగన్ తో భేటీ అయ్యారు. నిహార్ పెళ్లికి రావాల్సిందిగా జగన్ ని కోరారు. జగన్ కు శుభలేఖ అందించిన జయసుధ కాసేపు రాష్ట్ర పరిస్థితులపై ముచ్చటించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News