Daggubati Purandeswari: చంద్రబాబు గతంలో మండలిని రద్దు చేయమనలేదా?: పురందేశ్వరి

Purandeswari questions Chandrababu
  • ఏపీ పరిణామాలపై స్పందించిన పురందేశ్వరి
  • మండలి రద్దు నిర్ణయాన్ని చంద్రబాబు ప్రశ్నిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యాఖ్యలు
  • తమ పొత్తు జనసేనతోనే అని స్పష్టీకరణ
బీజేపీ నేత పురందేశ్వరి ఏపీ రాజకీయ పరిణామాలపై స్పందించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మండలి రద్దుపై వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు కూడా ప్రశ్నిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. ఆయన గతంలో మండలిని రద్దు చేయాలని అడగలేదా? అంటూ ప్రశ్నించారు.  వైసీపీ, టీడీపీలకు స్వార్థం ఎక్కువని విమర్శించారు. వైసీపీ, టీడీపీలను ప్రజలు ద్వేషిస్తున్నారని, ఆ రెండు పార్టీలు ప్రజల నమ్మకం కోల్పోయాయని అన్నారు. భవిష్యత్తులో బీజేపీ ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోదని, తమ భాగస్వామి జనసేన మాత్రమేనని పురందేశ్వరి స్పష్టం చేశారు.
Daggubati Purandeswari
Chandrababu
AP Legislative Council
Abolition
Telugudesam
YSRCP
BJP
Janasena

More Telugu News