Vijay Sai Reddy: వెట్టిచాకిరీ నిర్మూలన చట్టం 1976లోనే వచ్చినా ప్యాకేజి స్టార్ బయటపడలేకపోతున్నాడు: విజయసాయి

Vijayasai Reddy slams Pawan Kalyan
  • పవన్ కల్యాణ్ పై విజయసాయి పరోక్ష సెటైర్లు
  • ఇంగితం లేకుండా యజమానిని సమర్థిస్తున్నాడంటూ ట్వీట్
  • కట్టప్పను మించిపోయాడని వ్యంగ్యం
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తనదైన శైలిలో వ్యంగ్యం కురిపిస్తూ ట్వీట్ చేశారు. ఈసారి జనసేనాని పవన్ కల్యాణ్ ను పరోక్షంగా లక్ష్యంగా చేసుకున్నారు. వెట్టిచాకిరి నిర్మూలన చట్టం 1976లోనే వచ్చినా ప్యాకేజీ స్టార్ లాంటి వాళ్లు బానిస సంకెళ్ల నుంచి బయటపడలేకపోతున్నారని సెటైర్ వేశారు. జనం నవ్వుకుంటారన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా యజమానిని సమర్థిస్తున్నాడంటూ వ్యాఖ్యానించారు. 'పీఎస్' శ్రీనివాస్ అవినీతిని ప్రశ్నించే నైతిక హక్కు ఎవరికీ లేదంటున్నాడని, విధేయతలో కట్టప్పను మించిపోయాడని ఎద్దేవా చేశారు.
Vijay Sai Reddy
Pawan Kalyan
Chandrababu
YSRCP
Janasena
Telugudesam

More Telugu News