MangalKevat: రిక్షా కార్మికుని కుమార్తె వివాహానికి వెళ్లలేకపోయిన మోదీ... ఆయన్నే స్వయంగా పిలిపించుకుని..!

Narendra Modi Meets Riksha Puller
  • వారణాసిలో రిక్షా తొక్కే మంగల్ కేవత్
  • కుమార్తె వివాహానికి మోదీకి ఆహ్వానం
  • వారణాసి పర్యటనలో కేవత్ ను కలిసిన మోదీ
అతని పేరు మంగల్ కేవత్. వారణాసిలో రిక్షా కార్మికుడు. అంతకుమించి గంగానది భక్తుడు. రిక్షా నడిపించడం వల్ల తనకు లభించే కూలీ డబ్బుల్లో కొంత మొత్తాన్ని గంగా ప్రక్షాళనకు ఖర్చు పెడుతుంటాడు. తన కుమార్తెకు వివాహాన్ని తలపెట్టిన మంగల్ కేవత్, పెళ్లికి నరేంద్ర మోదీని ఆహ్వానించాలని భావించి, తొలుత లేఖ రాసి, ఆపై ఈ నెల 8న పీఎంఓ కార్యాలయానికి వెళ్లి శుభలేఖను అందించాడు కూడా.

వివాహానికి రాలేకపోయిన నరేంద్ర మోదీ, వధూవరులకు ఆశీస్సులు తెలుపుతూ లేఖను పంపించారు. గత ఆదివారం నాడు వారణాసి పర్యటనకు వచ్చిన నరేంద్ర మోదీ, మంగల్ కేవత్ ను తన వద్దకు పిలిపించుకున్నారు. ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇక మోదీ తనను పిలిపించుకోవడం సంభ్రమాశ్చర్యాలను కలిగించిందని మంగల్ వ్యాఖ్యానించాడు.
MangalKevat
Riksha Puller
Narendra Modi

More Telugu News