జీఎస్టీ వసూలులో టాప్-4కు దూసుకెళ్లిన తెలంగాణ!
- జనవరిలో 19 శాతం పెరిగిన వసూళ్లు
- తొలి స్థానంలో చండీగఢ్
- ఇప్పటివరకూ రూ. 24,135 కోట్ల వసూలు
- వసూలు టార్గెట్ లో 84 శాతం సాధించనున్న తెలంగాణ
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల కాలంలో రూ. 24,135.30 కోట్ల వస్తు సేవల పన్ను ఆదాయం వసూలైంది. మొత్తం మీద 2019-20లో రూ. 34,232.93 కోట్ల జీఎస్టీ ఆదాయం ఉంటుందని తొలుత అంచనా వేయగా, ఇప్పటికే 77.3 శాతం రాబడి వచ్చింది. మరో రెండు నెలలు మిగిలివుండగా, కనీసం రూ. 6 వేల కోట్ల వరకూ వసూలయ్యే అవకాశాలు ఉన్నాయని మొత్తం మీద టార్గెట్ లో 84 శాతం వసూళ్లను తెలంగాణ సాధించనుందని 15వ ఆర్థిక సంఘం అంచనా వేసింది.