Revanth Reddy: మోదీ, కేసీఆర్ ఒక్కటే: రేవంత్ రెడ్డి

Revanth Reddy slams Modi and KCR
  • తాజా పరిణామాలపై స్పందించిన రేవంత్ రెడ్డి
  • కేసీఆర్ పై గిరిజన వ్యతిరేకి అనే ముద్ర వేయాలని వ్యాఖ్యలు
  • అసమర్ధత కప్పిపుచ్చుకునేందుకు మోదీ కొత్త చట్టాలు చేస్తున్నారని విమర్శలు
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తాజా పరిణామాలపై స్పందించారు. ప్రధాని మోదీ తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కొత్త చట్టాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన వ్యతిరేక ప్రభుత్వం ఉందని కేసీఆర్ సర్కారుపై మండిపడ్డారు. కేసీఆర్ గిరిజన వ్యతిరేకి అని ముద్ర వేయాలని అన్నారు. మోదీ, కేసీఆర్ ఒక్కటేనని, రాష్ట్రపతి ఎన్నిక, నోట్ల రద్దు, ట్రిపుల్ తలాక్ అంశాలకు కేసీఆర్ ఆమోదం తెలిపారన్న విషయాన్ని ప్రజలు గమనించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ తలుచుకుంటే అసదుద్దీన్ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు.
Revanth Reddy
KCR
Narendra Modi
Congress
TRS
BJP

More Telugu News