Harish Rao: సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా భారీ కార్యాచరణ ప్రకటించిన హరీశ్ రావు

Harish Rao announces tree initiative on CM KCR birthday
  • ఇవాళ సీఎం కేసీఆర్ పుట్టినరోజు
  • సిద్ధిపేట జిల్లాలో లక్షా 10 వేల మొక్కలు నాటాలని హరీశ్ రావు నిర్ణయం
  • నాటిన ప్రతి మొక్కను కాపాడే బాధ్యతను ప్రజలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ 66వ జన్మదినం. ఈ సందర్భంగా కేసీఆర్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కేసీఆర్ కు ఆయన మేనల్లుడు, రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్ రావు కూడా విషెస్ తెలియజేశారు. అంతేకాదు, భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రకటించారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సిద్ధిపేట జిల్లాలో లక్షా 10 వేల మొక్కలు నాటేందుకు సంకల్పించామని హరీశ్ రావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ జన్మదినం జరుపుకున్నంత సంతోషంగా పాల్గొంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు, ప్రజలు తమ పుట్టినరోజు సందర్భంగా ఇలాగే మొక్కలు నాటాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను కాపాడే బాధ్యతను ప్రజానీకం స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. మొక్కలు నాటడం కాదు, వాటిని సంరక్షించడం గొప్ప పని అని హరీశ్ అభిప్రాయపడ్డారు.
Harish Rao
KCR
Saplings
Plantation
Sidhipet
TRS
Telangana

More Telugu News