శంషాబాద్ ఏసీపీని కలిసి.. సినిమా కోసం 'దిశ' ఘటన వివరాలు అడిగిన రామ్ గోపాల్ వర్మ
- 'దిశ' సినిమా తీస్తానని ఇటీవలే ప్రకటన
- పలు వివరాలు తెలుసుకుంటోన్న వర్మ
- తన పరిశోధన సినిమాకి ఉపయోగపడుతుందన్న దర్శకుడు
ఈ రోజు ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిధి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. శంషాబాద్ ఏసీపీని కలిసి దిశ కేసుకు సంబంధించి, పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. 'దిశ ఘటన గురించి సమాచారం తెలుసుకోవడానికి శంషాబాద్ ఏసీపీని కలిశాను. దిశ సినిమాను తీయడానికి నేను చేస్తోన్న పరిశోధన ఉపయోగపడుతుంది' అని ఓ జాతీయ మీడియాకు తెలిపారు.