Chandrababu: కేసీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలి: బర్త్ డే విషెస్ తెలిపిన చంద్రబాబు

Chandrababu Wishes KCR on his Birthday
  • నేడు కేసీఆర్ పుట్టిన రోజు
  • శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
  • ట్విట్టర్ లో ప్రత్యేక ట్వీట్
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జన్మదినోత్సవ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా వైభవంగా జరుగున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ ట్వీట్ ను పెట్టారు.

"తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలను ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను" అని తెలిపారు. పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. 
Chandrababu
KCR
Birthday
Twitter

More Telugu News