Twitter: పాపం చంద్రబాబు...తన పాస్‌వర్డ్‌ పీఎస్‌ వద్ద వదిలేశాడు: ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్‌

chandrababu financial affairs password in ps hands
  • ఇంటి గుట్టు మొత్తం శ్రీనివాస్ చేతుల్లో పెట్టేశాడు
  • ఐటీ దాడుల తర్వాత ఈ విషయం బయటపడింది
  • వ్యవస్థల్ని మేనేజ్‌ చేయగల దిట్ట ఇలా చేయడం ఆశ్చర్యమే
తన ఆర్థిక వ్యవహారాల పాస్‌వర్డ్‌ ను చంద్రబాబునాయుడు తన పీఎస్‌ శ్రీనివాస్ వద్ద వదిలేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెటైర్‌ వేశారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో దిట్ట అయిన చంద్రబాబునాయుడు తన దోపిడీ వ్యవహారాల గుట్టంతా పీఎస్‌ శ్రీనివాస్ చేతుల్లో పెట్టేసి ఇప్పుడు బిక్కసచ్చిపోయారని ట్విట్టర్‌లో వ్యంగ్యోక్తి విసిరారు.

‘ఇంత బతుకు బతికి ఇంటెనక...’ అన్నట్లు ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి తయారయ్యిందని వ్యాఖ్యానించారు. ఐటీ శాఖ దాడుల్లో రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన లెక్కలు దొరికాయని వైసీపీ ఆరోపిస్తుండగా, కాదు రెండు లక్షలే అని టీడీపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో విజయ్‌సాయిరెడ్డి ఈ విధంగా ట్వీట్‌ చేశారు.
Twitter
Chandrababu
Vijay Sai Reddy
IT Raids

More Telugu News