China: కరోనా ఎఫెక్ట్.. ఇండియా నుంచి చైనాకు మెడికల్ పరికరాలు

India to send medical supplies to china to combat corona virus
  • సహాయం చేసేందుకు ముందుకొచ్చిన సర్కారు
  • మాస్కులు, గ్లవ్స్, ఇతర ఉత్పత్తులు పంపేందుకు ఏర్పాట్లు
  • చైనాలోని ఇండియన్ అంబాసిడర్ విక్రమ్ మిస్రీ వెల్లడి
కరోనా వైరస్ దాడిని ఎదుర్కోవడంలో చైనాకు సహాయం చేసేందుకు ఇండియా నుంచి మెడికల్ పరికరాలను పంపనున్నారు. చైనాలోని ఇండియన్ అంబాసిడర్ విక్రమ్ మిస్రీ ఈ వివరాలు వెల్లడించారు. ఇండియా నుంచి ఓ పెద్ద షిప్ లో మెడికల్ పరికరాలు, ఉత్పత్తులను చైనాకు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు చెప్పారు. ఆపదలో ఉన్న చైనాను ఆదుకోవడానికి అవసరమైన అన్ని రకాల సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఎగుమతులపై నిషేధం సడలించి మరీ..

వైరస్ నివారణకు, బాధితులకు చికిత్స కోసం అవసరమైన పరికరాలు కావాలని చైనా కోరింది. ఈ నేపథ్యంలో మెడికల్ పరికరాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని సడలించి.. చైనాకు మాస్కులు, గ్లవ్స్, పరికరాలు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
China
Corona Virus
Corona Virus epidemic
india
india exports medical supplies

More Telugu News