Nimmakayala Chinarajappa: వైసీపీది తప్పుడు ప్రచారం.. ఇదిగో, ఈ రోజు ఐటీ అధికారులు ఇచ్చిన పంచనామా సాక్ష్యం :నిమ్మకాయల చినరాజప్ప

Chinarajappa fires on ysrcp
  • అవినీతిలో కూరుకుపోయినోళ్లకు అందరూ అవినీతిపరులే
  • పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది
  • టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప ట్వీట్
చంద్రబాబు మాజీ పీఎస్ పై ఐటీ దాడుల్లో పట్టుబడింది రూ.2 లక్షలు అయితే రూ.2 వేల కోట్లని వైసీపీ ప్రచారం చేస్తోందని టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. అవినీతిలో కూరుకుపోయిన వారికి అందరూ అవినీతిపరుల్లాగానే కనబడతారని వైసీపీపై విమర్శలు చేశారు. ‘ఇదిగో, ఈ రోజు ఐటీ అధికారులు ఇచ్చిన పంచనామా సాక్ష్యం’ అంటూ ఓ ట్వీట్ చేశారు. వైసీపీది తప్పుడు ప్రచారం అని ముందే చెప్పానని, పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనబడుతుందంటారని, అలాగే, వైసీపీ నేతలకు కూడా అంటూ ధ్వజమెత్తారు.
 

Nimmakayala Chinarajappa
Telugudesam
YSRCP

More Telugu News