Ambati Rambabu: రూ.2 వేల కోట్లు దొరికాయని నేను అనలేదు: అంబటి రాంబాబు

Ambati Rambabu clarifies over his own remarks on IT raids issue
  • రూ.2 వేల కోట్ల లావాదేవీలు సీజ్ చేశామని ఐటీ అధికారులే చెప్పారని వివరణ
  • ఈ విషయంలో చంద్రబాబు ఎందుకు మాట్లాడడంలేదన్న అంబటి
  • చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారంటూ వ్యాఖ్యలు
టీడీపీ చీఫ్ చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ నివాసంలో ఐటీ దాడుల్లో రూ.2 వేల కోట్లు దొరికాయని తానెప్పుడూ అనలేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రూ.2 వేల కోట్ల మేర అక్రమ లావాదేవీలు సీజ్ చేశామని ఐటీ అధికారులే చెప్పారని వివరించారు. శ్రీనివాస్ తో తమకేం సంబంధం అని యనమల అంటున్నారని, ఈ విషయంలో చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, చంద్రబాబుకు తాము క్షమాపణ చెప్పడం కాదు, చంద్రబాబే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు కచ్చితంగా శిక్ష పడాలని అన్నారు.
Ambati Rambabu
Chandrababu
IT Raids
Srinivas
YSRCP
Telugudesam

More Telugu News