Jeevitha: ఆమని మేం ఊహించినట్టే ఎదిగింది: జీవిత

Senior actress Jeevitha lauds Amani
  • మళ్లీ సినిమాల్లో నటిస్తున్న ఆమని
  • ఆమని ప్రధానపాత్రలో అమ్మ దీవెన
  • ట్రైలర్ విడుదల చేసిన జీవిత
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమని. పెళ్లి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆమని ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. ఆమె నటించిన తాజా చిత్రం 'అమ్మ దీవెన'. ఈ చిత్రానికి శివ ఏటూరి దర్శకుడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను సీనియర్ నటి జీవిత విడుదల చేశారు. ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ, ఆమని గతంలో రాజశేఖర్ తో కలిసి 'అమ్మకొడుకు' చిత్రంలో నటించిందని, అప్పటినుంచి ఆమనితో తనకు పరిచయం ఉందని వెల్లడించారు. 'అమ్మకొడుకు' చిత్రం షూటింగ్ సమయంలో ఆమని నటించే విధానం చూసి మంచి నటి అవుతుందని ఊహించామని, తాము భావించినట్టే అగ్రనటిగా ఎదిగిందని తెలిపారు.

ఇటీవల స్త్రీ ప్రధానపాత్రల్లో వచ్చే సినిమాలు తగ్గాయని, ఇప్పుడు 'అమ్మ దీవెన' రూపంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రం వస్తోందని, స్త్రీ శక్తిని ఎవ్వరూ ఆపలేరని జీవిత వ్యాఖ్యానించారు. ఆమని మాట్లాడుతూ, జీవిత అంటే తనకెంతో ఇష్టమని, ఈ చిత్రాన్ని ఆమె కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడడం సంతోషంగా ఉందని తెలిపారు.
Jeevitha
Amani
Amma Deevena
Tollywood

More Telugu News