Arvind Kejriwal: 'కేజ్రీవాల్ అనే నేను'.. ఢిల్లీ సీఎంగా సామాన్యుడి ప్రమాణ స్వీకారం

Arvind Kejriwal  taking oath as the Chief Minister for the third time
  • ప్రమాణ స్వీకారం చేయించిన లెఫ్టినెంట్ గవర్నర్
  • ప్రమాణ స్వీకారం చేసిన పలువురు మంత్రులు
  • రామ్‌లీలా మైదానంలో కార్యక్రమం
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా మూడవ సారి ఆయన ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించారు. ఆయనతో పాటు పలువురు మంత్రులతో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ప్రమాణ స్వీకారం చేయించారు.

మంత్రులుగా మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్, కైశాష్ గహ్లోత్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్ర గౌతమ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఢిల్లీ ఎన్నికల్లో వరసగా మూడో మూడోసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఇటీవల వెల్లడైన ఫలితాల్లో ఆప్ 62 సీట్లు గెలుచుకుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి కేజ్రీవాల్.. ఇతర రాష్ట్రాల సీఎంలను, రాజకీయ నాయకులను ఎవరినీ ఆహ్వానించలేదు. ప్రజల మధ్యే తాను ప్రమాణ స్వీకారం చేస్తానని ఇటీవల ఆయన ప్రకటించారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీ ప్రజలు రావాలని, తమ కుమారుడిని ఆహ్వానించాలని ఆయన కోరారు. చెప్పిన విధంగానే వారి మధ్య ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
Arvind Kejriwal
New Delhi
AAP

More Telugu News