TG Venkatesh: బీజేపీ, వైసీపీ కలయికను పైస్థాయిలో నిర్ణయిస్తారు: టీజీ వెంకటేశ్

TG Venkatesh opines over BJP and YSRCP
  • బీజేపీ, వైసీపీ పొత్తు అంటూ ప్రచారం
  • స్పందించిన టీజీ వెంకటేశ్
  • రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఎవరూ ఉండరని వ్యాఖ్యలు
ఏపీలో కొత్త పొత్తుకు తెరలేచిందా..? అనేలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీతో వైసీపీ జట్టు కట్టబోతోందని బలమైన ప్రచారం సాగుతోంది. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ స్పందించారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరని అన్నారు. బీజేపీ, వైసీపీ కలయికను పైస్థాయిలో నిర్ణయిస్తారని వెల్లడించారు. జగన్ నుంచి సంకేతాలు వచ్చాకే బొత్స అలా మాట్లాడి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో బీజేపీ వల్లే వైసీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని టీజీ పేర్కొన్నారు.
TG Venkatesh
Andhra Pradesh
BJP
YSRCP

More Telugu News