Pawan Kalyan: బీజేపీ పెద్దలు మాట ఇచ్చారు... అన్యాయం జరగదు: పవన్ కల్యాణ్

Shifting capital is not possible says Pawan Kalyan
  • అమరావతి రాజధాని అనే విషయం గత ప్రభుత్వ హయాంలోనే తీసుకున్నారు
  • రాజధానిని మార్చే అధికారం ప్రస్తుత ప్రభుత్వానికి లేదు
  • త్వరలోనే ర్యాలీలను నిర్వహిద్దాం
రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమేనని... అయితే, అమరావతి రాజధాని అనే నిర్ణయాన్ని గత ప్రభుత్వ హయాంలోనే తీసుకున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. ఇప్పుడు రాజధానిని మార్చే అధికారం ప్రస్తుత ప్రభుత్వానికి లేదని అన్నారు. రాజధానిని కదిలిస్తామని చెప్పడం అవగాహనా రాహిత్యమని చెప్పారు. అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో ఈరోజు పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యానించారు.

అమరావతిని గత ప్రభుత్వం నిర్ణయించినప్పుడు... వైసీపీ కూడా అంగీకరించిందని పవన్ అన్నారు. ఇప్పడు రాజధానిని మారుస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అమరావతి రైతులకు అండగా ఉంటామని బీజేపీ పెద్దలు కూడా చెప్పారని అన్నారు. రాజధాని రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని చెప్పారు. రాజధాని రైతులు, మహిళలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రైతులకు మద్దతుగా ర్యాలీలు చేద్దామని గతంలో అనుకున్నామని... అయితే ఢిల్లీ ఎన్నికల కారణంగా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశామని... త్వరలోనే ర్యాలీలను నిర్వహిద్దామని చెప్పారు. ఓట్ల కోసం తాను రాలేదని... రైతులకు భరోసా ఇవ్వడానికే వచ్చానని తెలిపారు.
Pawan Kalyan
Janasena
Amaravati
BJP

More Telugu News