Nani: అప్పటికీ ఇప్పటికీ నానీలో ఎలాంటి మార్పు లేదు: 'పిల్ల జమీందార్' నిర్మాత

Pilla Zamindar Movie
  • నాని స్టార్ డమ్ పట్టించుకోడు  
  • అడిగినంత పారితోషికం ఇచ్చాను 
  • ఆయనతో మరో సినిమా చేస్తానన్న డీఎస్ రావు 
నాని కథానాయకుడిగా చేసిన వినోదభరితమైన చిత్రాలలో 'పిల్ల జమీందార్' ఒకటి. ఆ సినిమాను డీఎస్ రావు నిర్మించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "నేను తీసిన సినిమాల్లో 'పిల్ల జమీందార్' మంచి విజయాన్ని సాధించింది. హీరోగా నాని ఎదుగుతున్న దశలో ఈ సినిమా ఆయనకి మంచి లిఫ్ట్ ఇచ్చింది. ఈ సినిమా కోసం నాని అడిగినంత పారితోషికాన్ని ఇచ్చాను.

నాని మంచి నటుడే కాదు .. మంచి మనిషి కూడా. 'పిల్ల జమీందార్' సినిమా అప్పటికీ .. ఇప్పటికి నాని క్రేజ్ ఎంతో పెరిగిపోయింది. అయినా ఆయన ధోరణిలో ఎలాంటి మార్పు రాలేదు. అప్పటి నానీనే ఇప్పటికి చూస్తున్నాను. స్టార్ డమ్ ను పక్కన పెట్టేసి మామూలు మనిషిగా ఆయన మాట్లాడే తీరు నాకు నచ్చుతుంది. వచ్చే ఏడాదిలో ఆయనతో ఒక సినిమా చేయాలనే ఆలోచనలో వున్నాను" అని చెప్పుకొచ్చారు.
Nani
D.S.Rao
Pilla Zamindar Movie

More Telugu News